మన ఇండస్ట్రీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే.. ఎవరైనా ఒక పాత్ర చేస్తే ఆ పాత్రకే పరిమితం చేస్తారు. ఆ ఆఫర్ లే క్యూ కడుతుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కుంటుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటి సినిమాతోనే సంచలనంగా విజయాన్ని సొంతం చేసుకున్న నటి ‘పాయల్ రాజ్ పుత్’ అయితే ఆ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలు చేసినా కూడా ఆమెకు కోరుకున్న గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. rx100, rdx లవ్ లో అలాంటి పాత్రలు చేయడంతో ఆమెపై ఆ ముద్ర పడిపోయింది. దీనితో మ్యాగ్జిమమ్ అలాంటి రోల్సే అమ్మడికి లైన్ కట్టాయి. ఈ నేపథ్యంలో ఆ ఇమేజ్ నుండి బయటకు రావటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో ఆమె కనిపిస్తుందట. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా కెరియర్‌కి కంప్లీట్‌గా ఇది కొత్త సినిమా… ఈ పాత్ర కోసం విజయశాంతి గారు చేసిన సినిమాలు స్ఫూర్తిగా తీసుకొని ఆమెలా నటించడానికి ప్రయత్నం చేశా.ఆమెని స్పూర్తిగా తీసుకొని నా స్టైల్ లో చేశా…కచ్చితంగా ఈ సినిమాతో తనకు ఇప్పటి వరకు ఉన్న గుర్తింపు మారిపోతుందని అనుకుంటున్న అని చెప్పింది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా పాయల్ కోరుకున్నట్టు తన ఇమేజ్ మారుతుందేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























