#NTR 30 మూవీ పై రూమర్ ను ఖండించిన నిర్మాతలు

NTR 30 Producers Denies Rumours On Movie Story

హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా #NTR 30 మూవీ రూపొందనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ మూవీ మే నెలలో పూజ కార్యక్రమం జరుపుకుని , రెగ్యులర్ షూటింగ్ జూన్, జూలై నెలలలో జరుపుకోనుందని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం మల్టీ స్టారర్ “RRR” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న”RRR” మూవీ షూటింగ్ రెండు , మూడు నెలలో కంప్లీట్ కానుంది. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే #NTR 30 మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. బాపు దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన “మంత్రి గారి వియ్యంకుడు ” మూవీ       ఇన్ స్పిరేషన్ తో దర్శకుడు త్రివిక్రమ్ స్టోరీ సిద్ధం చేస్తున్నట్టు #NTR 30 మూవీ స్టోరీ పై రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ వార్త నిరాధారమయిందని నిర్మాతలు ఖండించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.