ఓ … పిట్టకథ మూవీ రివ్యూ

O Pitta Katha Movie Review

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘ఓ పిట్టకథ’. టీజర్, ట్రైలర్ లతో మంచి అంచనాలను పెంచింది ఈ సినిమా. బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటంతో… ఇక ఈ సినిమాకు టాలీవుడ్ పెద్దలనుండి మంచి సపోర్ట్ ఏ లభించింది. ఈమద్య కాలంలో ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో పబ్లిసిటీ దక్కడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది.మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా పెద్ద హీరోలనుండి చిన్న హీరోల వరకు అంతా కూడా ఈ చిత్రంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు ఏదో ఒక విధంగా ప్రమోషన్‌లో భాగస్వామ్యం అయ్యారు. మరి అంత సపోర్ట్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలావుందో రివ్యూ లో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: సంజయ్‌ రావు, విశ్వంత్‌ దుద్దంపూడి, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: చెందు ముద్దు
నిర్మాత: వి. ఆనందప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌
మ్యూజిక్: ప్రవీణ్‌ లక్కరాజు

కథ:

ప్రభు(సంజయ్‌) తన చిన్నప్పటి నుండి వీర్రాజు కుమార్తె వెంకట లక్ష్మీ(నిత్య శెట్టి) అంటే ఎంతో ఇష్టంతో పెరుగుతాడు. వెంకటలక్ష్మి కూడా ప్రభును ఇష్టపడుతుంది. ప్రభు ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. ఇక అదే సమయంలో ఊర్లోకి క్రిష్‌ (విశ్వంత్) ఎంటర్‌ అవుతాడు.క్రిష్‌ కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు. ఇద్దరు కూడా ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఫ్రెండ్స్ తో అరకు టూర్ వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్ కి గురవుతుంది..ఇంతకు ఆ కిడ్నాపర్‌ ఎవరు? ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ చివరకు ఏమైంది అనేది తెలియాలంటే ‘ఓ పిట్టకథ’ సినిమా చూడాలి..

విశ్లేషణ:

ఇప్పటివరకూ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించున్నారు. ఇక ఇప్పుడు సంజయ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు. ఇక సినిమా విషయానికొస్తే… ఎక్కువ పాత్రలు లేకుండా కేవలం సినిమా కథ మొత్తం 5 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు చందు ఒక సింపుల్‌ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీని విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నించాడు. ప్రేమ కథలో కిడ్నాప్‌ డ్రామాను పెట్టి కథను ఆసక్తికరంగా నడిపించాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్.. సెకెండ్ హాఫ్ లో చివరి ముప్పై నిముషాలు సినిమాకు హైలెట్. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా నడిచినా సెకండాఫ్ సినిమాకు బలం. ఫస్టాఫ్ పెద్ద ఇంటర్వెల్ నుంచి సినిమా రూటు మారుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకుడి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. క్రిష్ ఎత్తులకు ప్రభు వేసే పైఎత్తులు మంచి థ్రిల్‌ను ఇస్తాయి.

ఇక పాత్రల విషయానికొస్తే ఈ సినిమాలో సంజయ్ తప్ప మిగిలిన వారందరూ కెమెరా ముందు చేసినవాళ్ళే. ఆ లోటు కాస్త కనిపిస్తుంది సంజయ్ విషయంలో. తొలి పరిచయమైన సంజయ్ నటన ఆహా.. ఓహో అనలేముకాని.. బాగానే చేసాడు. అయితే ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రం ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందే. ఎమోషనల్‌,రొమాంటిక్ సీన్స్‌లో ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరోయిన్ నిత్యా శెట్టి గురించి. తన క్యూట్ లుక్స్ తో, అభినయంతో ఆకట్టుకుంది. ఇక విశ్వంత్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే చేసాడు. అలాగే సంజయ్ ఫ్రెండ్ పాత్ర అయిన పండు పాత్రలో చేసిన నటుడు సూపర్బ్ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగా నవ్వించాడు. బ్రహ్మాజీ ఎప్పటిలాగే తన నటనతో అక్కటుకోగా.. మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా వారి పరిధిమేర చేశారు.

సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కాకినాడ మరియు గోదావరి అందాలను అద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ ను బెస్ట్ గా ప్రెజంట్ చేశారు. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. వెంకట్ ప్రభు ఎడిటింగ్ పర్వాలేదు. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్ ఉన్నాయి.

ఇక ఓవరాల్ చెప్పాలంటే సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షుకులకు నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.