బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత అనుష్క ప్రధానపాత్రలో “నిశ్శబ్ధం “మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కోన ఫిల్మ్ కార్పొరేషన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో స్టైలిష్ మూవీ “సాహో ” రూపొందిన విషయం తెలిసిందే. అనుష్క ” నిశ్శబ్ధం” మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా “సాహో ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు అఫర్ వచ్చింది. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 వంటి సూపర్ హిట్ మూవీస్ లో ప్రభాస్ తో నటించిన అనుష్కకు మరొక సారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం ఆసక్తిని కలిగించింది. US లో షూటింగ్ పర్మిషన్స్, ఆర్టిస్ట్స్ కాంబినేషన్స్ విషయం లో నిర్మాతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో అనుష్క పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభాస్ తో నటించే స్పెషల్ సాంగ్ ఆఫర్ ను మిస్ చేసుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























