నందిని రెడ్డి దర్శకత్వంలో హీరో నాగచైతన్య

Oh Baby Director Nandini Reddy To Direct Naga Chaitanya

బ్లాక్ బస్టర్ “ఆలా మొదలైంది ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “జబర్దస్త్”, “కల్యాణ వైభోగమే “, “ఓ బేబీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ “ఓ బేబీ ” మూవీ తరువాత నందిని రెడ్డి ఇప్పుడు ఒక మూవీ కి కమిట్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై రూపొందిన “మహానటి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి వర్కింగ్ స్టైల్ నచ్చి “మహానటి’ మూవీ నిర్మాతలు నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. స్వప్న సినిమా బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ రూపొందనుంది. హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి ప్రస్తుతం US లో ఉన్నారు. నందిని US నుండి వచ్చిన తరువాత ఈ మూవీ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =