చందమామ కథల తరహాలో తెరకెక్కిన `బాహుబలి` చిత్రాలు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. డార్లింగ్ కి పాన్ – ఇండియా స్టార్ ఇమేజ్ ని కట్టబెట్టాయి. కట్ చేస్తే… ఇప్పుడిదే తరహాలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో `ప్రభాస్ 21` రాబోతోంది. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… చందమామ కథ తరహాలో తెరకెక్కనుందట. సైంటిఫిక్ ఫిక్షన్ గా ఈ సినిమా రూపొందనుందని కొన్ని కథనాలు వచ్చినా… `పాతాళ భైరవి` తరహాలో జనరంజక జానపద చిత్రంగా `ప్రభాస్ 21` ఉంటుందని వినికిడి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అంతేకాదు… ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తారని టాక్. ఈ సంవత్సరాంతంలో పట్టాలెక్కనున్న `ప్రభాస్ 21`… 2021 చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. `బాహుబలి` సిరీస్ ని మించి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























