చిత్ర పరిశ్రమకి ఎందరో కథానాయికలు వస్తుంటారు… పోతుంటారు. అయితే, కొందరు మాత్రమే తమదైన అభినయసంతకం చేసి సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన కథానాయికల్లో సమంత ఒకరు. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గత చిత్రం `జాను` వరకు… తను నటించిన ప్రతీ చిత్రంలోనూ తనదైన నటనతో పలు పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసింది సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జెస్సీ (ఏ మాయ చేసావె), బిందు (ఈగ), నిత్య (ఎటో వెళ్ళిపోయింది మనసు), కృష్ణవేణి – ప్రియ (మనం), అనసూయ రామలింగం (అ ఆ), అమృత (రాజు గారి గది 2), రామలక్ష్మి (రంగస్థలం), రచన (యూ టర్న్), శ్రావణి (మజిలీ), స్వాతి – సావిత్రి (ఓ బేబి), జాను (జాను)… ఇలా పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా… సమంత అభినయం అద్వితీయం… అనితరసాధ్యం.




పెళ్ళయ్యాక కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ.. స్టార్ డమ్ ని కొనసాగిస్తున్న కథానాయికగానూ సామ్ ప్రయాణం అభినందనీయం.
అలాంటి సామ్ నటించిన తొలి చిత్రం `ఏ మాయ చేసావె` విడుదలై నేటికి (ఫిబ్రవరి 26)కి సరిగ్గా పదేళ్ళు. అంటే.. నాయికగా సామ్ కెరీర్ మొదలై ఇవాళ్టితో దశాబ్దం పూర్తవుతోందన్నమాట. తన తొలి కథానాయకుడు నాగచైతన్యని జీవిత భాగస్వామిగా చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలైన సామ్.. మున్ముందు కూడా మరిన్ని విభిన్న భూమికల్లో అలరించాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























