ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో కలిసి నాని హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రయిలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




కాగా శౌలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చూద్దాం నాని బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా నానికి ఎంత సక్సెస్ తెచ్చిపెడుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























