ఎన్టీఆర్-సమంత కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బృందావనం సినిమాతో మొదట స్క్రీన్ షేర్ చేసుకున్న వీరిద్దరూ.. ఇప్పుడు ఆ తర్వాత రభస, ‘రామయ్య వస్తావయ్యా’ ఆతర్వాత జనతా గ్యారేజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు చేశారు. ఇప్పుడు ఐదోసారి జత కట్టనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ తోనే తన తర్వాత సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో… ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందు ఈ సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు.. మళ్ళీ పూజాహెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక ను తీసుకుంటున్నట్టు టాక్స్ వినిపించాయి. ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నందుకు రష్మిక ను తీసుకోవాలని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సమంత పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా ఒక హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో వచ్చే 5వ చిత్రం అవుతుంది. మరి చూద్దాం ఫైనల్ గా త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కు ఫిక్స్ అవుతారో.
[custom_ad]




కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాషూట్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























