గత ఏడాది `మజిలీ`, `వెంకి మామ` చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అలరించాడు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `లవ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో కనిపించనున్నాడు చైతూ. వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ఈ చిత్రం రిలీజయ్యే లోపే `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు చైతూ. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `నాగేశ్వర రావు` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే, ఇందులో చైతూ కూడా ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాడట. వయసు చిన్నదే అయినా పాతకాలం భావాలూ, పెద్దరికం, బాధ్యతలూ రంగరించిన పాత్రలో చైతూ దర్శనమిస్తాడట. అంతేకాదు… పాత్ర స్వభావానికి తగ్గట్టు `కంప్లీట్ ఫ్యామిలీ మేన్` లేదా `ప్యాక్డ్ ఫ్యామిలీ మేన్` అనే క్యాప్షన్ ని `నాగేశ్వరరావు` టైటిల్ కి జోడించనున్నారట. కథానాయికగా రష్మికగానీ, కీర్తి సురేష్ గానీ నటించే అవకాశముందని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: