ఈ సంక్రాంతికి `దర్బార్`తో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్… దీపావళికి మరో క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య భూమికల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్ లో పోరాట ఘట్టాల్ని రూపొందిస్తున్నారు. సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్… చిత్రానికి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని సమాచారం. మరి.. గత కొంతకాలంగా తన స్థాయి విజయాలను అందుకోలేకపోతున్న సూపర్ స్టార్.. ఈ చిత్రంతోనైనా విజయఢంకా మ్రోగిస్తారేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































