సురేందర్ రెడ్డి తో అఖిల్..?

Akhil To Work With Surender Reddy

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉండగా ఈ సినిమా అవ్వకముందే అఖిల్ మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడత. ‘సైరా’ తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దాంతో అఖిల్ కి కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.