తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఆ లిస్ట్ లో రానా, ప్రభాస్ తర్వాత టక్కున గుర్తొచ్చే పేరు నితిన్. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో నుండి బయటకు వచ్చేశాడు నితిన్. గత కొద్దిరోజులుగా నితిన్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో షాలినితో కలిసి నిశ్చితార్ధ వేడుకని జరుపుకున్నాడు నితిన్. ఈ వేడుకకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Pelli panulu started..
Mussssikk startttts ❤️❤️❤️
Need ur blessings…🤗🤗 pic.twitter.com/bQ3zXUO7s6— nithiin (@actor_nithiin) February 15, 2020
[custom_ad]




నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడిందట.. ! స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారిందట. ఇద్దరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ఒకటి అవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ తరవాత తమ ప్రేమ విషయాన్నీ పెద్దలు ముందు ఉంచారని తెలుస్తోంది
కాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఆ తర్వాత రంగ్ దే, అందుదాన్ రీమేక్ చిత్రాలతో బిజీ కానున్నాడు నితిన్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























