సూపర్ హిట్ “గుండె జారి గల్లంతయ్యిందే”,” ఒక లైలా కోసం” మూవీస్ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా..” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న “ఒరేయ్ బుజ్జిగా..” మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్, నరేష్, పోసాని, అనీష్ కురువిల్లా, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాత రాధా మోహన్ మాట్లాడుతూ .. “ఒరేయ్ బుజ్జిగా..” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుత స్పందన లభిస్తుందని, ఈ మూవీ యూత్ &ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిందని, రాజ్ తరుణ్, విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ కు మంచి కమర్షియల్ మూవీ అవుతుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























