‘మిస్ ఇండియా’ – ‘కొత్తగా కొత్తగా’ కీర్తి సురేష్

Miss India lyrical song,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Miss India lyrical,Miss India song,Keerthy Suresh Miss India lyrical,Miss India Songs,Keerthy Suresh Miss India Songs,Keerthy Suresh,Keerthy Suresh Latest News 2020

మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌రేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా “MISS INDIA” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మ‌హేష్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీ లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.


[custom_ad]

దీనితో పాటు ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ‘పెంగ్విన్’ అనే తమిళ్ సినిమా కూడా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాను వ‌చ్చే ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ఓ సినిమా చేస్తుంది. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.