దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `క్రిష్` సిరీస్ లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. `కోయ్ మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)… ఇలా ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత ఈ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తొలి మూడు భాగాల్లో కథానాయకుడిగా నటించిన హృతిక్ రోషన్ నే హీరోగా నటిస్తుండగా.. హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ సూపర్ హీరో సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, `క్రిష్ 4`లో నాయికగా అందాల తార కత్రినా కైఫ్ ఎంపికైందని బాలీవుడ్ సమాచారం. త్వరలోనే కత్రినా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. `కోయ్ మిల్ గయా`లో ప్రీతి జింటా నాయికగా నటించగా.. `క్రిష్`, `క్రిష్ 3`లో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























