షూటింగ్ స్పాట్ లోనే విజయ్ కు ఐటీశాఖ షాక్..!

IT Raids On Tamil Superstar Vijay,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Tamil actor Vijay,Vijay,Tamil Film Actor Vijay Residence IT Raids,Bigil Producers Raided by Income Tax,thalapathy vijay Latest News

తమిళ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తన సినిమాల ద్వారానే కాకుండా.. ఈ మధ్య పలు విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సమయంలో ఐటీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి షాకిచ్చారు. అసలు సంగతేంటంటే.. విజయ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన ‘బిగిల్’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ సైతం సాదించింది.  ‘విజయ్ సినిమా అంటే ఆ మాత్రం కలక్షన్స్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’. ఇక ఈ సినిమాను నిర్మించింది AGS ఎంటర్టైన్మెంట్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే AGS ఎంటర్టైన్మెంట్స్ చెందిన పలు ఆఫీస్ లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఆ సంస్థకు చెందిన సుమారు 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. దానితో పాటు ఆ సినిమాలో హీరోగా నటించిన విజయ్ ను అతడు రాబోయే సినిమా “మాస్టర్” కు సంబంధించిన సినిమా సెట్ కు వెళ్లి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు విజయ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.. సినిమాకు ఎంత లాభాలు వచ్చాయి.. ఏ రూపంలో తీసుకున్నారు.. వాటిని ఏ రూపంలో విజయ్ ఖర్చు చేశారన్న తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇదిలా ఉంటే 2015లో కూడా ఇదే రకమైన విచారణ విజయ్ ఎదుర్కొన్నారు.

[custom_ad]

కాగా గతంలో కూడా విజయ్ పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెర్సిల్’ సినిమాలో డీ మోనేటైజషన్, డిజిటల్ ఇండియా పై పలు ప్రస్తావించడంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ కి యాంటీ అన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మురగదాస్ తో తీసిన సర్కార్ లో తమిళనాడు రాజకీయాలు ను ప్రస్తావించి అప్పుడు ఆ ఆరోపణులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు బిగిల్ వాళ్ళ ఐటీ సోదాలు. దీనిపై కూడా విజయ్ క్లారిటీ ఇస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.