పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి) నిర్మాణ సారథ్యం లో అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , మోడల్ కేతికా శర్మ జంటగా మాఫియా నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ “రొమాంటిక్” మూవీ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో మందిరా బేడీ, మకరంద్ దేశ్ పాండే, దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి కనెక్ట్స్ నిర్మించిన “ఇస్మార్ట్ శంకర్” మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “రొమాంటిక్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రొమాంటిక్ “మూవీ కి పూరి జగన్నాథ్ స్టోరీ, డైలాగ్స్ అందించడం విశేషం. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. “రొమాంటిక్ “మూవీ కి ఎనర్జిటిక్ స్టార్ రామ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























