సినీరంగ అభివృద్ధికి చిరు-నాగ్ లతో తలసాని భేటీ..!

Chiranjeevi And Nagarjuna Meet Talasani Srinivas Yadav

అలనాటి లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సినిమాలు చేస్తున్నప్పుడే మద్రాస్ నగరం నుండి మన తెలుగు పరిశ్రమను హైదరాబాద్ కు తరలించుకున్నారు. అప్పటినుండి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయిను చేరుకుంది. పక్కన సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే రేంజ్ కు ఎదిగాం.. ఇక ఇప్పుడు ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు మన అగ్ర హీరోలు. ఇక సినీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీయార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లతో సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సినిమా రంగానికి కీలకంగా మారిన నేపథ్యం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. దానిని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి హైదరాబాద్ లో సినిమా రంగం మరింతగా అభివృద్ధి చెంది.. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.