ఉప్పెన నుండి రాబోతున్న ‘ఫస్ట్ వేవ్’

Uppena Movie First Wave Will Be Out Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Uppena,Uppena Movie,Uppena Telugu Movie,Uppena Movie Updates,Uppena Telugu Movie Latest News,Uppena First Wave,Panja Vaisshnav Tej,Krithi Shetty,Vijay Sethupathi,Buchi Babu

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ మెగా హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడాని వస్తున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇవ్వదానికి రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.9 నిమిషాలకు ఈ సినిమా నుండి ‘ఫస్ట్ వేవ్’ రాబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


[custom_ad]

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ హీరో అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.