మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరో నాని నెగటివ్ రోల్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో హీరో నాని ఈ నెలలో జాయిన్ అవుతారు. “టక్ జగదీష్” మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని నాని భావిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]



“టక్ జగదీష్” మూవీ తరువాత నాని మరొక కొత్త మూవీ ని పట్టాలెక్కించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా భారీ బడ్జెట్ తో ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఇద్దరు కథానాయికలలో ఒకరిగా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సాయి పల్లవి ని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం.
నాని, సాయి పల్లవి జంటగా “MCA” మూవీ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య తో “లవ్ స్టోరీ”, రానా తో “విరాటపర్వం ” మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























