సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. `చంద్రముఖి` (2005), శివాజీ (2007) (ప్రత్యేక గీతం), `కథానాయకుడు` (2008), దర్బార్ (2020)… ఇలా ఇప్పటికే నాలుగు సినిమాల్లో రజినీతో ఆడిపాడే అవకాశం దక్కించుకుంది నయన్. కట్ చేస్తే.. తాజాగా మరోమారు రజినీతో కలసి నటించే అవకాశం దక్కించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ కథానాయకుడిగా `శౌర్యం` శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నయన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా, మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























