మెగా కాంపౌండ్ లో దాదాపు పది మంది కథానాయకులు ఉన్నారు. అయితే, వారంతా ఒకే ఏడాదిలో సందడి చేసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆ ముచ్చట తీరేలా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ `పింక్` రీమేక్ సమ్మర్ లో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో`తో బ్లాక్ బస్టర్ కొట్టగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్`తో సెకండాఫ్ లో పలకరించనున్నాడు. ఇక `సుప్రీమ్` హీరో సాయితేజ్ `సోలో బ్రతుకే సో బెటర్` అంటూ మే 1న వస్తుండగా.. అంతకంటే ముందు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`తో ఏప్రిల్ 2న తెరంగేట్రం చేస్తున్నాడు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామాతో ఎంటర్ టైన్ చేయనుండగా.. అల్లు శిరీష్ ఓ రీమేక్ తో పలకరించబోతున్నాడు. అదేవిధంగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ `సూపర్ మచ్చి` అంటూ వినోదాలు పంచబోతున్నాడు. ఇక నాగబాబు తనయ నిహారిక కూడా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో పలకరించేందుకు సిద్ధమవుతోంది.
[custom_ad]
మరి.. వీరిలో ఎవరెవరి ఖాతాలో విజయాలు చేరుతాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































