శ‌ర్వానంద్ తో కిషోర్ తిరుమ‌ల చిత్రం?

Kishore Tirumala Teams Up With Sharwanand For A New Movie

`నేను శైల‌జ‌`తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు పొందాడు కిషోర్ తిరుమ‌ల‌. ఆపై `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ`, `చిత్ర‌ల‌హ‌రి`తో అల‌రించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. ప్ర‌స్తుతం త‌న ల‌క్కీ హీరో రామ్ తో మూడో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త‌మిళ చిత్రం `త‌డ‌మ్`కి రీమేక్ గా రూపొందుతున్న ఆ సినిమానే `రెడ్`. ప్ర‌స్తుతం ఈ చిత్రం.. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, ఈ సినిమా రిలీజ‌య్యేలోపే త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప్రారంభించబోతున్నాడు కిషోర్. ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం.. యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో కిషోర్ తిరుమ‌ల త‌దుప‌రి చిత్రం రూపొంద‌నుంద‌ట‌. సుధాక‌ర్ చెరుకూరి నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.