కార్తికి జోడీగా త్రిష‌

Trisha To Pair Up With Karthi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Trisha Latest News,Trisha Upcoming Movie News,Trisha Next Film Updates,Trisha Latest Movie Details,Actress Trisha Next Project News

దాదాపు 17 ఏళ్ళుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది చెన్నై బ్యూటీ త్రిష‌. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తూ త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకుంటున్న ఈ అందాల అభినేత్రి.. ఇటీవ‌ల `96`తో మ‌రోమారు మైమ‌రిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం త్రిష చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి – స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌స్తున్న సినిమా ఒక‌టి కాగా.. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కి జోడీగా న‌టిస్తున్న మ‌ల‌యాళ చిత్రం `రామ్` మ‌రొక‌టి. ఇక మూడోది లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `పొన్నియ‌న్ సెల్వ‌న్`.

[custom_ad]

కాగా, భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష ఎవ‌రికి జోడీగా న‌టిస్తుందో అన్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. కోలీవుడ్ స్టార్ కార్తికి జోడీగా త్రిష క‌నిపిస్తుంద‌ట‌. ఇప్ప‌టికే కార్తి అన్న సూర్యకి జంట‌గా `మౌనం పేసియ‌దే`, `ఆరు` వంటి చిత్రాల్లో అల‌రించింది త్రిష‌. మ‌రి.. సూర్య స‌ర‌స‌న ఆక‌ట్టుకున్న త్రిష‌.. కార్తికి జంట‌గానూ మెస్మ‌రైజ్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.