“సీటీమార్” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Seetimaarr Movie First Look Is Out

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “హిప్పీ” మూవీ ఫేమ్ దిగాంగన మరో కథానాయిక కాగా, తరుణ్ అరోరా ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రావు రమేష్, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

శ్రీనివాసా చిట్టూరి నిర్మాణ సారథ్యంలో భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువల తో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న “సీటీమార్” మూవీ లో హీరో గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ కోచ్ గా , తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. “సీటీమార్” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. గోపీచంద్ కోచ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. సంపత్ నంది కాంబినేషన్ లో తమన్నా “రచ్చ , గోపీచంద్ “గౌతమ్ నంద” మూవీ రూపొందాయి. గోపీచంద్, తమన్నా జంటగా “సీటీమార్” మూవీ లో ఫస్ట్ టైమ్ నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.