`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి మలి షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రారంభం కానుంది. ఆపై మెరుపు వేగంతో సినిమాని పూర్తి చేసి సెప్టెంబర్ లో జనం ముందుకు తీసుకురావాలని బన్నీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. వాస్తవానికి, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా 2021 సంక్రాంతి వచ్చే అవకాశముందన్న మాటలూ వినిపించాయి. అయితే, అంతకంటే ముందే రిలీజ్ కానుండడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ సీజన్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























