సంక్రాంతికి ఊర్లలో కోడి పందాలు , చిత్ర పరిశ్రమలో సినీ పందాలు సర్వ సాధారణం. కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలలో ఎవరు విజేత అన్నది సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. కోడి పందేలలో విజేత ఎవరు అన్నది నిముషాలలో తేలిపోతుంది. కానీ సినీ పందాలలో ఫైనల్ విన్నర్ ఎవరు అన్నది తేలడానికి కనీసం వారం పది రోజుల నిరీక్షించ వలసిఉంటుంది. ప్రస్తుతం ఆ నిరీక్షణ తుది దశకు చేరుకుంది. ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమా, మూడు స్ట్రెయిట్ చిత్రాలు కలుపుకుని మొత్తం నాలుగు చిత్రాలు విడుదల కాగా ప్రధాన పోటీ రెండు చిత్రాల మధ్యన కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అయితే ఆనందించదగిన విషయం ఏమిటంటే ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ అండ్ రిజల్ట్ ను ఎంజాయ్ చేస్తున్నాయి.
[custom_ad]
జనవరి 9న విడుదలైన రజనీకాంత్ ‘ దర్బార్ ‘ , 11న విడుదలైన ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ , 12న విడుదలైన ‘అల వైకుంఠపురంలో ‘ 15న విడుదలైన ‘ ఎంత మంచివాడవురా ‘ చిత్రాలలో ఏ ఒక్క చిత్రానికి కూడా నెగిటివ్ రిపోర్టు రాకపోవటంతో 2020 కి మంచి శుభారంభం లభించినట్లయింది.
కాగా ఈ నాలుగింటిలో బాక్సాఫీస్ కలెక్షన్ల ర్యాట్ రేస్ లో పోటాపోటీగా తలపడుతున్న చిత్రాలు రెండు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు ,అనిల్ సుంకర నిర్మించిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్, రాధా కృష్ణ నిర్మించిన అల వైకుంఠపురం లో చిత్రాల మధ్య జరుగుతున్న బాక్సాఫీసు వార్ తుది దశకు చేరుకుంది. బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్, నాన్ బాహుబలి రికార్డ్స్ , ఓవర్ సీస్ రికార్డ్స్, సెంటర్ వైజ్ రికార్డ్స్, స్టార్ వైజ్ రికార్డ్స్ వంటి ట్రేడ్ అండ్ ఫాన్స్ పరిభాషతో ఉభయ తెలుగు రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. నిజానికి ఈ కలెక్షన్ల పోస్టర్లు, పబ్లిసిటీ అంతా ఆయా నిర్మాతల ప్రచార ఉదృతికి అద్దం పడుతున్నాయే కానీ నిజమైన facts and figures ఇంకా రావలసి ఉంది. సో… ఫైనల్ గా 2020 సంక్రాంతి విజేత ఎవరు అనేది తేలటానికి సమయం ఆసన్నమైన తరుణంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం చిత్రాలలో నిజమైన సంక్రాంతి విజేత ఎవరు అన్నది మీరే తెల్చేయండి.
[custom_ad]
అందుకు వేదికగా నిలుస్తుంది ఈ పోల్ గేమ్. సో…who is the real winner of 2020 Sankranthi ? అన్నది మీ చేతుల్లో ఉంది….సో… ఇంకెందుకు ఆలస్యం?
Decide & Declare the winner of 2020.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: