సంక్రాంతి పండుగకు ‘మ్యాంగో మ్యూజిక్’ నుండి స్పెషల్ సాంగ్

Madhu Priyas Sankranthi Special Song Out Now

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో మ్యాంగో మ్యూజిక్ ఒక స్పెషల్ సాంగ్ ను కూడా మీకోసం తీసుకొచ్చింది. ‘రానే వచ్చిందే సంక్రాంతి’ అని వచ్చే ఈ పాటను సింగర్ మధు ప్రియా పాడగా.. భోలేషా వలి సంగీతం అందించాడు. సంక్రాంతి పండుగ విశేషతలను ఈ పాట ద్వారా చక్కగా చెప్పారు. ఇక ఈ పాటను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తుండగా.. ఈలోపు పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మీరు కూడా ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.