ఈ నెల 20 నుంచి ‘అసుర‌న్’ రీమేక్ రెగ్యుల‌ర్ షూటింగ్‌?

Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Movie Shooting Latest News, Asuran Telugu Remake Movie Shooting To Begin From January 20, Asuran Telugu Remake Shooting Updates, Asuran Telugu Remake Updates, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

త‌మిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్` (ధ‌నుష్‌)ని… తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో… రాయ‌ల‌సీమలోని అనంత‌పురం జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో సింహ‌భాగం స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. హైద‌రాబాద్ లోనూ కొంత‌మేర షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే లొకేష‌న్లు కూడా ఫైన‌లైజ్ అయ్యాయ‌ని వినికిడి. కాగా, చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి ఈ ఏడాది వేస‌వి చివ‌ర‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.