అనతికాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగిన వైనం యంగ్ హీరో విజయ్ దేవరకొండ సొంతం. వరుస విజయాలతో, అవకాశాలతో.. సినీవినీలాకాశంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు ఈ యువ సంచలనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… కెరీర్ ఆరంభంలో తెలుగు టైటిల్స్ ఉన్న సినిమాలతోనే ఎక్కువగా సందడి చేసిన విజయ్ దేవరకొండ.. ఈ మధ్యంతా ఆంగ్ల శీర్షికలతో పలకరిస్తుండడం విశేషం. రీసెంట్ గా `డియర్ కామ్రేడ్`గా పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్… త్వరలో `వరల్డ్ ఫేమస్ లవర్`గా రాబోతున్నాడు. అంతేకాదు.. రాబోయే సినిమాలు కూడా `ఫైటర్`, `హీరో`… ఇలా వరుసగా ఇంగ్లిష్ టైటిల్స్ తోనే తెరకెక్కుతుండడం విశేషం. మరి… `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`… ఇలా తెలుగుదనం ఉన్న శీర్షికలతో మంచి విజయాలు చూసిన విజయ్.. ఇంగ్లిష్ టైటిల్స్ తోనూ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























