విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `శత్రువు` ఒకటి. ఈ సినిమాతోనే సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. మొదటి ప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించగా.. పవర్ ఫుల్ విలన్ రోల్ లో కోట శ్రీనివాసరావు దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ – కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా `పొద్దున్నే పుట్టింది`, `అమ్మ సంపంగి రేకు` గీతాలు అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించాయి. తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాని హిందీలో `విజేత` (సంజయ్ దత్, రవీనా టాండన్) పేరుతో రీమేక్ చేశారు. 1991 జనవరి 2న విడుదలైన `శత్రువు`… నేటితో 29 వసంతాలను పూర్తిచేసుకుని 30లోకి అడుగుపెడుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























