జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ” RRR”- శ్రీ సింహా

RRR Movie Going To Be The Best Movie In Junior NTR Film Career - Sri Simha

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ ” RRR” మూవీ శరవేగంగా రూపొందుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. అజయ్ దేవగన్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ తో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు.హీరో శ్రీ సింహా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీ” RRR” అన్నారు. ” RRR” మూవీ కథ తెలుసు కాబట్టే బెస్ట్ మూవీ అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “యమదొంగ ” మూవీ లో చిన్నప్పటి ఎన్టీఆర్ గా శ్రీ సింహా నటించిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానున్న ” RRR” మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.