వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి “ఘనవిజయం సాధించింది. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకొన్న విషయం తెలిసిందే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … సావిత్రమ్మ ఆశీస్సులు కారణం గానే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకొన్నానని , ఈ అవార్డ్ ను సావిత్రమ్మకే అంకితం చేయాలని భావిస్తున్నానని, తనపై నమ్మకం ఉంచిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలని, “మహానటి ” కథ విన్న తరువాత అంత గొప్ప కథ కు న్యాయం చేయలేనని అంగీకరించలేదని, మామయ్య గోవింద్
“మహానటి ” మూవీ లో నటించడానికి ఒప్పించారని , సావిత్రమ్మ జీవిత కథ ఎమోషనల్ గా తనకెంతో దగ్గరయ్యిందని, సావిత్రమ్మ గురించి ఎన్నో బుక్స్ చదివానని, ఆమె నటించిన మూవీస్ చూశానని, జాతీయ అవార్డ్ అందుకొన్న తరువాత ఒత్తిడి పెరిగిందని, కథల ఎంపిక లో జాగ్రత్త వహిస్తున్నానని, నటిగా విభిన్న పాత్రలు, ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం గా భావిస్తున్నానని కీర్తి సురేష్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























