నందమూరి హీరో కళ్యాణ్ రామ్… `రావణ` పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వేణు మల్లిడి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. 2020 జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… అదే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా… వారిలో ఒకరిగా కేథరిన్ ట్రెసా ఎంపికైందని సమాచారం. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో… కేథరిన్ కూడా సబ్జెక్ట్ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి.
కాగా, కళ్యాణ్ రామ్ తాజా చిత్రం `ఎంత మంచివాడవురా` జనవరి 15న రిలీజ్ కానుండగా… కేథరిన్ అప్ కమింగ్ ఫిల్మ్ `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























