అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో కూడా ఇప్పటినుండే జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను సాంగ్స్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 5వ తేదీన ఎల్బి స్టేడియం లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కు అతిథిగా మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. వచ్చే నెల 5న ఎల్ బి స్టేడియం లో సాయంత్రం జరగనున్న ఈ మెగా ఈవెంట్ కి చిరు ముఖ్య అతిధిగా రానున్నట్లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు.
Get ready for the Super-Mega-Landmark Event🤩#SarileruNeekevvaruPreRelease event on JAN 5th at LB Stadium #SarileruNeekevvaru #SarileruNeekevvaruOnJan11th #MaheshBabu @iamRashmika @AnilRavipudi @ThisIsDSP pic.twitter.com/SLykKgh9d5
— Telugu FilmNagar (@telugufilmnagar) December 20, 2019
#SarileruNeekevvaru pre-release event on JAN 5th! pic.twitter.com/cXkf1Wj1nG
— Mahesh Babu (@urstrulyMahesh) December 20, 2019
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























