సీక్వెల్ మూవీస్ ఎప్పుడూ కథానాయకుల పక్షమే. అయితే, అతి కొద్ది సీక్వెల్స్ మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటాయి. వీటిల్లో… హీరోలతో పాటు హీరోయిన్లూ కొనసాగుతుంటారు. అలాంటి అరుదైన `సీక్వెల్` ఆఫర్లను సొంతం చేసుకున్న నాయికలుగా సౌత్ లో అనుష్కని, నార్త్ లో సోనాక్షి సిన్హాని ప్రస్తావించవచ్చు. ఎందుకంటే… ఈ ఇద్దరు కూడా వేర్వేరు భాషలకు చెందిన ఫ్రాంచైజీల తాలూకు మూడు కొనసాగింపు చిత్రాల్లో నాయికలుగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ సూర్యకి `సింగం`(తెలుగులో `యముడు`) సిరీస్ ఎలాంటి గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా… అన్నింటిలోనూ అనుష్కనే ప్రధాన నాయికగా నటించింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన `దబంగ్` సిరీస్ విషయానికి వస్తే… ఇంతవరకు ఈ ఫ్రాంచైజీలో మూడు చిత్రాలు రాగా, మూడింటిలోనూ సోనాక్షి సిన్హానే ప్రధాన నాయికగా నటించింది. ఈ సిరీస్ లోని మూడో చిత్రం `దబంగ్ 3` రేపు (డిసెంబర్ 20) హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… అటు `సింగం` సిరీస్, ఇటు `దబంగ్` సిరీస్ కాప్ స్టోరీలతో రూపొందిన సినిమాలే కాగా… రెండు ఫ్రాంచైజీల్లోని తొలి చిత్రాలు ఒకే ఏడాది(2010)లో రిలీజవ్వడం మరో విశేషం. మొత్తమ్మీద… కాప్ ఫ్రాంచైజీలలో నాయికలుగా కొనసాగి అటు స్వీటీ, ఇటు సోనాక్షి రేర్ రికార్డు సొంతం చేసుకున్నారన్నమాట.
కొసమెరుపు ఏమిటంటే… సీక్వెల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన ఈ ఇద్దరు కథానాయికలు… ఐదేళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ చిత్రం `లింగ`(2014)లో నాయికలుగా నటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























