`బాహుబలి` సిరీస్ లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్… ఆ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా… తెలుగునాట సత్యరాజ్ కి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు అందించింది సదరు కట్టప్ప పాత్ర. ఈ నేపథ్యంలో… సత్యరాజ్ నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ప్రత్యేక ఆసక్తి నెలకొంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, డిసెంబర్ 20 సత్యరాజ్ తెలుగు అభిమానులకు ప్రత్యేకం కానుంది. ఎందుకంటే… అదే రోజున సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన రెండు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ చిత్రాలే… `ప్రతిరోజూ పండగే`, `దొంగ`. సాయితేజ్ కి తాతగా సత్యరాజ్ నటించిన `ప్రతి రోజూ పండగే`డిసెంబర్ 20న రానుండగా… కార్తి, జ్యోతికకి తండ్రిగా యాక్ట్ చేసిన తమిళ అనువాద చిత్రం `దొంగ` కూడా అదే రోజున విడుదల కాబోతోంది. మరి… ఈ చిత్రాలతో నటుడిగా సత్యరాజ్ స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: