`రంగ‌మార్తాండ‌`లో శివాత్మికా రాజశేఖ‌ర్?

Shivathmika Rajashekar To Play A Pivotal Role In Rangamarthanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Shivathmika Rajasekhar in Rangamarthanda,Shivathmika Rajasekhar in Rangamarthanda Movie,Shivathmika Rajasekhar in Rangamarthanda Telugu Movie,Shivathmika Rajasekhar Role in Rangamarthanda Movie,Actress Shivathmika Rajasekhar Character in Rangamarthanda Telugu Movie

`దొర‌సాని`తో క‌థానాయిక‌గా తొలి అడుగు వేసింది రాజ‌శేఖ‌ర్ – జీవిత గారాలప‌ట్టి శివాత్మిక‌. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ గ‌ర్ల్ కి… ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `రంగ‌మార్తాండ‌` అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రాఠీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ `న‌ట సామ్రాట్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో ప్ర‌కాష్ రాజ్, ర‌మ్య‌కృష్ణ జంట‌గా న‌టిస్తున్నారు. వారి కుమార్తె పాత్ర‌లో శివాత్మిక క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. అలాగే గాయ‌నిగా ఆమె ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు… `బిగ్ బాస్ సీజ‌న్ 3` టైటిల్ విన్న‌ర్ రాహుల్ సింప్లిగంజ్ కి జోడీగా ఆమె పాత్ర ఉంటుంద‌ని వినికిడి. మ‌రి… ఈ చిత్రంతోనైనా శివాత్మికకి విజ‌యం ద‌క్కుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.