బాలీవుడ్ ఫిల్మ్ కి డీఎస్పీ బాణీలు?

Devi Sri Prasad To Score Music For A Bollywood Movie

`దేవి`(1999)తో స్వ‌ర‌క‌ర్త‌గా తొలి అడుగేసిన యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్… ఈ ఏడాదితో 20 ఏళ్ళ సంగీత ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నాడు. ఇప్ప‌టికీ అదే జోష్ తో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ రాక్ స్టార్ చెంత‌కి ఓ బాలీవుడ్ ఆఫ‌ర్ చేరింద‌ని తెలిసింది. ఆ వివ‌రాల్లోకి వెళితే… ర‌ణ్ వీర్ సింగ్, షాలినీ పాండే జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ `జ‌యేయ్ భాయ్ జ‌ర్దార్` అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి బాణీలు అందించే అవ‌కాశం దేవిశ్రీ‌కి ద‌క్కింద‌ని వినికిడి. బాలీవుడ్ లో ఇప్ప‌టికే `రెడీ`(2011), `జ‌య‌హో` (2014), `భాగ్ జానీ` (2015) చిత్రాల కోసం సింగిల్స్ అందించాడు దేవిశ్రీ‌. అయితే, ఒక పూర్తి స్థాయి చిత్రానికి బాణీలు స‌మ‌కూర్చ‌డం ఇదే తొలిసారి అవుతుంది. త్వ‌ర‌లోనే డీఎస్పీ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.