`పింక్` రీమేక్ లో నివేదా థామ‌స్?

Nivetha Thomas To Play Lead Role In Pink Movie Remake,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pink Movie Remake Female Lead Role,Nivetha Thomas Pink Movie Remake,Pink Movie Remake Recent News,Nivetha Thomas New Movie Details

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయిక‌ల్లో నివేదా థామ‌స్ ఒక‌రు. `జెంటిల్ మ‌న్`, `నిన్ను కోరి`, `118`, `బ్రోచేవారెవ‌రురా` చిత్రాల్లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో అల‌రించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే… త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ‌రోసారి పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట నివేదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్`కి రీమేక్ గా తెలుగులో ఓ చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ఇదిలా ఉంటే… మాతృక‌లో తాప్సీ పోషించిన పాత్ర‌లో నివేదా థామ‌స్ క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కు ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, స‌మంత వంటి స్టార్ హీరోయిన్ల‌ పేర్లు వినిపించినా… ఆ అవ‌కాశం నివేదాకి ద‌క్కింద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే నివేదా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =