సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీజనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న మహేష్ బాబు పరిచయ వీడియో ను మహేష్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్స్, విజయశాంతి పోస్టర్, టీజర్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లోని సెకండ్ సింగిల్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో నటించిన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ మూవీ ప్రేక్షకులకు విందు భోజనం వంటిదని, కామెడీ, ఎమోషన్ సీన్స్ పండాయని, సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులు లైక్ చేసే మూవీ అని, హీరో మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ గా నిలుస్తుందని అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































