‘నర్తనశాల’ సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో ‘అశ్వథ్థామ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఉదయం 11:30 నిముషాలకు గ్రాండ్ ప్రెస్ మీట్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఈ మూవీకి సంబందించిన విశేషాలను పాత్రికేయులతో పంచుకోనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ యంగ్ హీరో తన అశ్వథామ చిత్రం గురించి ఏమి విశేషాలు పంచుకుంటారో చూడాలి. కాగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు
కాగా ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడట. చూద్దాం మరి ఈ సినిమా అయినా కలిసొస్తుందేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































