బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ‘వెంకీమామ’ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ `వెంకీమామ`కి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో.. వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మరి చూద్దాం మామా అల్లుళ్లు తెరపై ఎలాంటి సందడి చేయబోతున్నారో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: