‘రొమాంటిక్’ లో రామ్..!

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే ఈ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 30 రోజుల పాటు జ‌రిగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, పూరి మార్క్ బీచ్ సాంగ్ ను షూట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో రామ్ అతిథి పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఇప్పటికే గోవాలో రామ్ కనిపించే సీన్ ను కూడా చిత్రీకరించారట. పూరి కోసం రామ్ ఈ సినిమా చేసినట్టు చేస్తుంది. కాగా పూరీ, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.`ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.