వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వరల్డ్ ఫేమస్ లవర్`గా పలకరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. నాలుగు విభిన్న ప్రేమకథలతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి నాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మరో వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ కు సంబంధించిన దృశ్యాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రీకరణలో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోందని తెలిసింది. మరి… నాలుగు డిఫరెంట్ లుక్స్ లో `వరల్డ్ ఫేమస్ లవర్`గా కనిపించనున్న విజయ్… వరల్డ్ వైడ్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























