స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన `నా పేరు సూర్య`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు రచయిత వక్కంతం వంశీ. మొదటి ప్రయత్నంలోనే నిర్దేశకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… స్వల్ప విరామం తరువాత తన సెకండ్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… రెండో సినిమాని కూడా మెగా కాంపౌండ్ హీరోతోనే చేయబోతున్నాడని వినికిడి. ఆ హీరో మరెవరో కాదు… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని సమాచారం. అలాగే కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో చేయబోతున్న స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఈ సినిమాని కూడా సమాంతరంగా చేసే దిశగా వరుణ్ ప్రణాళిక రచిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే వరుణ్, వక్కంతం వంశీ కాంబినేషన్ ఫిల్మ్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























