ప్రతీ మండే మహేష్ డే

Sarileru Neekevvaru Movie Updates Now On Every Monday

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ మూవీ “సరిలేరు నీకెవ్వరు ” సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు ” మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. అనిల్ రావిపూడి బర్త్ డే సందర్భంగా నవంబర్ 22 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచనుంది. ఇక నుండి ప్రతీ సోమవారం “సరిలేరు నీకెవ్వరు ” మూవీ అప్ డేట్ రిలీజ్ కానుంది. సాంగ్స్, పోస్టర్స్ , గ్లిం ప్స్ వీడియోలు, ట్రైలర్ వంటివి ప్రతీ సోమవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ పై భారీ అంచనాలు
నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.