`కాటమరాయుడు` (2017) తరువాత టాలీవుడ్ కి దూరమైన శ్రుతి హాసన్… మాస్ మహారాజా రవితేజ `క్రాక్`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. `బలుపు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత తన లక్కీ హీరో (రవితేజ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో… శ్రుతి ఈ కాప్ స్టోరీపై భారీ ఆశలే పెట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… శ్రుతి కంటే ముందు మరో ముగ్గురు నాయికలు రవితేజ సినిమాలతో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చిన వైనం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే… `హనుమాన్ జంక్షన్` తరువాత టాలీవుడ్ కి దూరమైన స్నేహ… రవితేజ `వెంకీ`తోనే రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక `భగీరథ` తరువాత అన్యభాషా చిత్రాలతో బిజీ అయిపోయిన శ్రియ… టాలీవుడ్ లో మళ్ళీ రవితేజ నటించిన `డాన్ శీను`లోనే పూర్తిస్థాయి కథానాయికగా కనువిందు చేసింది. మరో విజయాన్ని ఒడిసిపట్టుకుంది. అలాగే, `దేవుడు చేసిన మనుషులు` తరువాత బాలీవుడ్ పై కన్నేసిన ఇలియానా కూడా… గత ఏడాది రవితేజ `అమర్ అక్బర్ ఆంటొని`తోనే తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చింది.
మొత్తమ్మీద… కథానాయికల రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు మన మాస్ మహారాజా. మరి… స్నేహ, శ్రియ రీ-ఎంట్రీకి కలిసొచ్చిన `రవితేజ ఫ్యాక్టర్` శ్రుతికి కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























