ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

Indraganti Mohan Krishna To Direct Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Vijay Deverakonda New Movie Details,Vijay Deverakonda Upcoming Movie Updates,Vijay Deverakonda Next Movie With Indraganti Mohan Krishna,Vijay Deverakonda Upcoming Film With Director Indraganti Mohan Krishna

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`తో బిజీగా ఉన్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్… ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ఈలోపే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్`ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు విజ‌య్. అలాగే శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో ఓ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాడ‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్ లోనూ విజ‌య్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంద‌ని వినికిడి. మ‌రి… ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్ లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే… ఇంద్ర‌గంటి ప్ర‌స్తుతం `వి`తో బిజీగా ఉన్నాడు. నేచుర‌ల్ స్టార్ నాని సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఉగాది కానుక‌గా మార్చి 25న థియేట‌ర్ల‌లోకి రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.